కలం, వెబ్ డెస్క్: కొలంబియా(Colombia)లో ఘోర విమాన ప్రమాదం(Plane Crash) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం కుప్పకూలి అందులో ఉన్న 15 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కొలంబియా సివిల్ ఏవియేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ విమానయాన సంస్థ సటెనా (Satena) నిర్వహిస్తున్న ఈ విమానంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 13 మంది ప్రయాణికులు కాగా, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. విమానం సరిహద్దు నగరమైన కుకుటా నుంచి బయలుదేరి ఒకానా పట్టణానికి వెళ్తుండగా ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో వెనెజువెలా (Venezuela) సరిహద్దుల్లో కొండ ప్రాంతాల్లో విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో కొలంబియా (Colombia) శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో, రాబోయే ఎన్నికల అభ్యర్థి కార్లోస్ సాల్సెడో సైతం ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానం బీచ్‌క్రాఫ్ట్ 1900 మోడల్‌కు చెందిన విమానం అని అధికారులు వెల్లడించారు.
Read Also: భారత్-ఈయూ ఒప్పందంతో దేశానికి కొత్త అవకాశాలు : మోడీ
Follow Us On: Pinterest


