సినిమా టికెట్ రేట్లు పెంచడం దోపిడీ కాదు : పవన్ కల్యాణ్‌

కలం, వెబ్ డెస్క్ : పవన్ కల్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Pawan Kalyan). ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కాబోతోంది. తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్‌ సంచలన కామెంట్లు చేశారు. ‘సినిమాలకు టికెట్ రేట్లు పెంచితే నాకు ఇదంతా ఎందుకు అనిపించేది. కానీ మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. సినిమా అనేది కంపల్సరీ కాదు. మీ మీద గన్ పెట్టి కచ్చితంగా సినిమాను థియేటర్ కు వెళ్లి చూడమని ఎవరూ చెప్పట్లేదు. మనకు సినిమా ఒక ఛాయిస్ మాత్రంఏ. వెళ్లాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం. మనకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ఇంట్లో టీవీ ఉంది. ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. వాటిల్లో కూడా సినిమాలు చూడొచ్చు’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు.

అలాగే ప్రభుత్వం పెంచిన టికెట్ రేటులో ప్రతి రూపాయిలో కొంత మొత్తం పన్ను రూపంలో వెళ్తుందని.. కాబట్టి టికెట్ రేట్ల పెంపును దోపిడీ కోణంలో చూడొద్దని పవన్ కల్యాణ్‌ చెప్పారు. తన సినిమాలకు తక్కువ రేట్లు ఇచ్చుకున్నానని.. కానీ ఇతర హీరోల సినిమాలకు ఎక్కువ రేట్లు ఇప్పించినట్టు పవన్ చెప్పారు పవన్ కల్యాణ్‌.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>