కలం, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-ఈయూ(India-EU) ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) దేశానికి గొప్ప భవిష్యత్తును అందిస్తుందని, దీంతో కొత్త అవకాశాలు రానున్నాయని మోడీ వెల్లడించారు. భారత వ్యాపారాలకు ఈ ఒప్పందం మార్కెట్లు తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ ప్రస్తుతం “రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్” పై ఉందని, ఆర్థిక వృద్ధి, గ్లోబల్ పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు ముందుకు సాగుతున్నామని మోడీ స్పష్టం చేశారు. ఈయూ ఒప్పందం యువత ఆశయాలకు తోడ్పడుతుందని, ఇది ఆత్మనిర్భర్ భారత్ అభివృద్ధికి ప్రోత్సాహకమని వ్యాఖ్యానించారు. నేడు 2026–27 ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్(Union Budget) సమర్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధి, ఉద్యోగాలు, గ్లోబల్ భాగస్వామ్యాలు, యువతపై ప్రధానంగా దృష్టి పెట్టి నిర్ణయాలు తీసుకుంటుందని మోడీ తెలిపారు.


