కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో భారీగా మంచు కురుస్తోంది(Snowfall). ఈ ప్రభావంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మంచు ప్రభావంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అధికారులు జమ్మూ-శ్రీనగర్(Jammu-Srinagar) జాతీయ రహదారిని మూసివేశారు. మరోవైపు శ్రీనగర్‌లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాతావరణం అనుకూలించిక పోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమాన స్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. ఈ మేరకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి.


