కానిస్టేబుల్ దారుణ హత్య.. కత్తితో పొడిచిన స్నేహితుడు!

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ ఉప్పల్ (Uppal) పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చిలకానగర్ లో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. చిలకానగర్​ ఆదర్శనగర్​ సాయిబాబా ఆలయం సమీపంలో దుండగులు ఏఆర్​ కానిస్టేబుల్​ ను కత్తులతో అతికిరాతకంగా పొడిచి హత్య (Constable Murder) చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెంగిచెర్లలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్ కుమార్ (39), హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఆదివారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఆదర్శనగర్, చిల్కానగర్‌లోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉండగా, అతని స్నేహితుడైన సంతోష్ నాయక్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో సుధీర్​ కుమార్ ను కడుపు, మెడ భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయినట్లు సమాచారం. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>