కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) డైరక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ” ఉస్తాద్ భగత్ సింగ్ “(Ustaad Bhagat Singh). ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన (Buchi Babu Sana) పాల్గొని తన స్పీచ్‌తో ఎంతగానో ఆకట్టుకున్నారు.
తాను పవన్ కల్యాణ్ వల్లనే డైరెక్టర్ అవ్వాలని అనుకున్నట్లుగా బుచ్చి బాబు తెలిపారు. మాది పిఠాపురం.. మా ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు నేను డైరెక్టర్‌గా మారడానికి కారణం పవన్ కల్యాణ్ గారే. కాకినాడలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా కాలేజీ స్టేట్ టాపర్ కిరణ్ రాజుతో పోటీ పడాలి అనుకునేవాడ్ని. తను పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ చూసి వీరాభిమాని అయిపోయాడు. తన కంటే గొప్పవాడిని అవ్వాలంటే డైరెక్టర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయినట్లు బుచ్చి బాబు తెలిపారు.

