epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

హార్వ‌ర్డ్‌లో భార‌తీయ విద్యార్థుల‌తో సీఎం రేవంత్ స‌మావేశం

క‌లం, వెబ్‌ డెస్క్‌: లీడ‌ర్ షిప్ కోర్స్ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికాలోని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో (Harvard University) ఉన్న కెన్నెడీ స్కూల్ ప్రోగ్రాముల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా హార్వ‌ర్డ్‌లోని భార‌తీయ విద్యార్థుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని క్యాంపస్‌లోని తమ పాఠశాలకు ఆహ్వానించింది. తన తరగతులు, అసైన్‌మెంట్లు పూర్తయ్యాక వారి పాఠ‌శాల‌కు వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి నేప‌థ్యం, విద్యా ప్రయాణం, భవిష్యత్ కెరీర్ లక్ష్యాలు, స్థానికంగా ఎదురవుతున్న‌ సవాళ్ల గురించి తెలుసుకున్నారు.

‘తెలంగాణ రైజింగ్’లో (Telangana Rising) భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం విద్యార్థుల‌కు వివరించారు. తమకు ఉన్న నెట్‌వర్క్‌, ప్రతిభను ఉపయోగించి భారతదేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని విద్యార్థులను కోరారు. అలాగే హైదరాబాద్‌, తెలంగాణలో ఉన్న అవకాశాలు, బలాలను ప్రపంచానికి చాటేలా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను విద్యార్థుల‌కు తెలియ‌జేశారు. ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి అంశాలపై విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చ‌ర్చించారు.

Read Also: స‌స్పెండ్ చేసినా మ‌ళ్లీ పోటీ చేసి గెలుస్తా: దానం నాగేంద‌ర్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>