కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ మారింది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రచారంలో సీఎం పాల్గొనాల్సి ఉన్నా.. 4వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. మొదటి సభ మిర్యాలగూడ సభలో సీఎం పాల్గొంటారు. ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న వికారాబాద్ జిల్లా పరిగిలో, 8వ తేదీన భూపాల పల్లిలో జరిగే ప్రచార సభలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరవుతారు.
అమెరికా నుంచి షెడ్యూలు ప్రకారం రేపు (ఆదివారం) రాత్రికి వస్తున్నా ప్రచార సభలకు మాత్రం ఒక రోజు ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు రీ షెడ్యూలు చేసుకున్నారు. యథావిధిగా ఫిబ్రవరి 2 మధ్యాహ్నం మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత మంత్రులతో రాష్ట్రంలోని తాజా పరిణామాలతో పాటు రాజకీయపరమైన ప్రాధాన్యతా అంశాలను కూడా చర్చించనున్నారు.
సింగరేణి బొగ్గు గనుల టెండర్ విషయంలో అవకాశాన్ని బట్టి మంత్రుల సమావేశం తర్వాత స్వయంగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. అమెరికా నుంచి శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) బయలుదేరడానికి ముందు అక్కడి నుంచే పీసీసీ నాయకులు, మంత్రులతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టి తాజా పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
Read Also: ఇదే నా చివరి మీటింగ్ : జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
Follow Us On: Sharechat


