కలం, వెబ్ డెస్క్: ఇదే నా చివరి కౌన్సిల్ మీటింగ్ అంటూ జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) భావోద్వేగానికి గురయ్యారు. పదవిలో లేకున్నా హైదరాబాద్ నగరంపై తనకు ఉన్న ప్రేమ, బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతాయని ఆమె తెలిపారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి రోజు సమావేశం వాడివేడిగా సాగింది. సభ్యుల మధ్య వాగ్వాదాలు, ఆందోళనల మధ్య సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ (GHMC Mayor) విజయలక్ష్మి.. హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. నగర ప్రజల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ సభ్యులు ఎల్లప్పుడూ సమిష్టిగా పనిచేయాలని కోరారు.
అయితే సభ్యుల నిరసనలు, అభ్యంతరాల నడుమే రూ.11,460 కోట్ల వార్షిక బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌పై చర్చ జరగగా, అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయించలేదని కొందరు సభ్యులు విమర్శించారు. మరోవైపు, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని అధికార పక్షం తెలిపింది.
Read Also: ఎర్రవెల్లిలో న్యాయ నిపుణులతో కేసీఆర్ భేటీ
Follow Us On: Pinterest


