గణపతీ.. లొంగిపో.. : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి (Maoist Ganapathi) లొంగిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రహస్య జీవితాన్ని, ఆయుధాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. ప్రస్తుతం “గణపతి గారి ఆరోగ్యం బాగా లేదని సమాచారం ఉంది… ఆయన లొంగిపోతే వారికి అవసరమైన వైద్యం అందిస్తాం… అవసరమైన భద్రతను కూడా కల్పిస్తాం… సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది…” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. “మావోయిస్టులు ఇంకెవరైనా అజ్ఞాతంలో ఉన్నా లొంగిపోవాలి… లొంగిపోయిన వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది… అభివృద్ధిలో వారందరినీ భాగస్వాములను చేస్తుంది.. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్టవుతుంది… ప్రభుత్వం పిలుపు మేరకు 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు” అని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మావోయిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి పై విధంగా అప్పీల్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>