ఘాట్ ఫుట్‌పాత్‌పై నిద్రించిన బాలీవుడ్ నటుడు.. నెట్టింట వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సునీల్ గ్రోవర్ (Sunil Grover) సోషల్ మీడియాలో తన సాదాసీదా జీవనశైలికి సంబంధించిన మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గంగా ఘాట్ (Ganga River Ghat) పక్కన ఫుట్‌పాత్‌పై రాత్రి వేళ నిద్రిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయనతోపాటు పలువురు భక్తులు కూడా బహిరంగ ప్రదేశంలోనే నిద్రిస్తూ కనిపించారు. ఈ వీడియోకు ఆయన “తారే జమీన్ పర్” అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇది రిషికేశ్‌లో (Rishikesh) తీశారా లేదా హరిద్వార్‌లా అనేది స్పష్టంగా తెలియలేదు. సునీల్ గ్రోవర్ ఇలాంటి సాధారణ జీవనశైలి వీడియోలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన రోడ్డు పక్కన చేతి పంపు వద్ద బట్టలు ఉతకడం, పొయ్యిపై రోటీలు చేయడం వంటి వీడియోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఇక సునీల్ గ్రోవర్ (Sunil Grover) వృత్తిపరమైన విషయానికి వస్తే.. ఆయన చివరిగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో కనిపించారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఖాదర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖ నటులను ఆయన చేసే మిమిక్రీ సోషల్ మీడియాలో ఇప్పటికీ విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. టీవీ తెరపై ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే సునీల్ గ్రోవర్, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా మరో కోణాన్ని అభిమానుల ముందుకు తీసుకువచ్చారు.

Read Also: అక్క‌డ‌ బీచ్‌లో నిద్ర‌పోతున్న‌ జ‌నం.. ఎందుకంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>