కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన పోస్ట్ చేశారు. ఎన్నికల ఉపశమనం ముగిసింది. ‘ఇక ద్రవ్యోల్బణం వేడి తగలబోతుంది. ఏప్రిల్ 29వ తేదీ తరువాత పెట్రోల్, డీజిల్ సహా అన్ని రకాల ధరలు పెరగబోతున్నా యి. ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలతో జేబులు నింపుకున్నది. ఇప్పుడు ధరలు పెరగడంతో ఆ భారాన్ని ప్రజలపై వేయబోతుంది. ధరలు తక్కువ ఉన్నప్పుడు దోచుకునే ప్రభుత్వం.. ద్రవ్యోల్బణం అంటూ ప్రజలపైకి భారాన్ని నెడుతోంది’ అని పోస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఖండించినా..
రాహుల్ గాంధీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రధానంగా చమురు ధరలు పెరుగుతాయని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. బెంగాల్ రెండో దశ ఎన్నికలు ముగిసిన వెంటనే.. ధరలు పెంచబోతున్నారని కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మంగళవారం నాడు కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మరోసారి ఇలాంటి ప్రకటనే చేసింది. దీంతో, నిజంగానే చమురు ధరలు పెరుగుతాయా.. మోదీ ప్రభుత్వం ఏం చేయబోతుంది.. అనే చర్చ జోరుగా సాగుతోంది.

