కలం, వెబ్ డెస్క్: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా దావోస్‌లో (Davos) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం పర్యటన కొనసాగుతోంది. నేడు సీఎం బృందం తెలంగాణ పెవిలియన్ వద్ద పలువురు కార్పొరేట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి దారులకు కల్పిస్తున్న వెసులుబాట్లు, స్థానికంగా ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించారు. రాష్ట్రంలో వ్యాపారాలు ప్రారంభించేందుకు పలువురు కార్పొరేట్ ప్రతినిధులు ఆసక్తి చూపించినట్లు సమాచారం. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి బృందం కృషి చేస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. విమానయాన రంగం, గ్రీన్ ఎనర్జీ, ఏఐ తదితర రంగాల్లో ఎంవోయూలు జరిగాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో కోట్లాది పెట్టుబడులు రానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

Read Also: జీవన్ రెడ్డి వాకౌట్ పై సంజయ్ కుమార్ రియాక్షన్ ఇదే..
Follow Us On: Pinterest


