కలం, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు (Nidadavolu) ప్రాంతంలో మహిళలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షం అడ్డుపడుతున్న తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షం ఈ బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన చారిత్రక అవకాశాన్ని ఇలా అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల సాధికారతే దేశ అభివృద్ధికి కీలకమని, రాజకీయ నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన ద్వారా మహిళల హక్కుల కోసం తాను నిలబడుతున్నానని చంద్రబాబు తెలిపారు.
Read Also: ఆ పార్టీలు మూల్యం చెల్లించుకుంటాయి.. జగన్ ఫైర్
Follow Us On: X(Twitter)

