‘అందుకే విడిపోయాం’.. విడాకులపై హన్సిక స్పందన

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ హన్సిక (Hansika Motwani).. వివాహం చేసుకున్న మూడేళ్లకే విడాకులు తీసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు వస్తాయో.. ఎలా ఊహించగలుగుతాం. డివోర్స్ తీసుకున్నాక.. ఎప్పుడూ బాధపడలేదు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే.. పాత విషయాలను మర్చిపోవాలి’ అని పేర్కొన్నారు.

వాళ్లిద్దరూ లేకపోయుంటే..

డివోర్స్ తీసుకున్నాక.. తాను ఇబ్బంది పడినట్లు హన్సిక చెప్పుకొచ్చారు. ‘విడాకులు తీసుకోవడంతో చాలా డిస్టర్బ్ అయ్యా. నా మెంటల్ హెల్త్ పూర్తిగా దెబ్బతిన్నది. ఒక రకమైన చీకట్లో ఉండిపోయా. నా తల్లి, సోదరుడు అండగా నిలిచారు. వారికి నేను డల్ గా ఉండటం నచ్చదు. వైవాహిక జీవితం ఇబ్బందిగా అనిపిస్తే.. బయటకు రావొచ్చు. ఒత్తిడితో జీవించాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. మెంటల్ హెల్త్ థెరపీ తీసుకోవాలని భావించి.. అలాగే చేశా. ఇప్పుడు చాలా వరకు ప్రశాంతంగా ఉన్నా. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్చుకున్నా’ అని ఎమోషనల్ అయ్యారు. 2022లో సోహైల్ కథూరియా అనే వ్యాపారవేత్తతో హన్సిక వివాహం జైపుర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. తరువాత, విబేధాల కారణంగా 2025లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటను కలిపి ఉంచేందుకు ఇరు కుటుంబాలు ఎంత ప్రయత్నించినా.. చివరికి పరస్పర అంగీకారంతో వేరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>