సీఎం మేడిగడ్డ పర్యటనలో ఆంతర్యమేంటి? : మాజీ మంత్రి ఎర్రబెల్లి

కలం, వరంగల్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటన వెనుక ఉన్న ఆంతర్యమేంటో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ నాయకులు బృందంతో కలిసి ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక ఆరోపణలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల్లో లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ మీటింగ్ అంటే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. గతంలో కేసీఆర్ నల్గొండలో సభ పెడితే భయంతో ఆ రోజు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండని, ఇప్పుడు జగిత్యాల మీటింగ్ అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని  విమర్శించారు.

కేసీఆర్‌ను బద్నామ్ చెయ్యాలనే..

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంటే ఒక మేడిగడ్డ కాదు అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెల్లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్లు, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసే వ్యవస్థ అని ఎర్రబెల్లి వివరించారు. 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి ఉపయోగమే కాళేశ్వరంగా ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్ట్ మీద కుట్ర చేసి కేసీఆర్ ను బద్నామ్ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కాలయాపన చేసారని విమర్శించారు. మేడిగడ్డ నుండి నీటిని నిల్వ చేయకుండా కిందకు పంపింది.. కాంగ్రెస్ నాయకుల ఇసుక రవాణా గురించేననే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (SRSP) కు మహారాష్ట్ర నుండి చుక్క నీరు రాకుండా అక్రమంగా 10 ప్రాజెక్టులు కడితే తెలంగాణ ఎడారిగా మారింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణను అన్నపూర్ణగా మార్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని రేవంత్ అంటే.. మంత్రి శ్రీధర్ బాబు ఏమో మూసినది వరకు కాళేశ్వరం నీరు వస్తుంది అనడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.

మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్ పనులు తామే సొంత ఖర్చులతో పూర్తి చేస్తామని ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ జగిత్యాల సభను విజయవంతం కావద్దనే దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో ఎగిరేది బిఆర్ఎస్ జెండానే అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆరురి రమేష్, దాసరి మనోహర్, శంకర్ నాయక్, ఎంపి మాలోత్ కవిత, మాజీ జెడ్పి ఛైర్మన్లు గండ్ర జ్యోతి లక్ష్మి, జక్కు శ్రీ హర్షిణి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read Also: సింహం వస్తోందంటే గుంటనక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>