కలం, వెబ్‌డెస్క్: విద్యా సంస్థల సమీపంలో తంబాకు, గంజాయి, సిగరెట్లు వంటి మాదకద్రవ్యాల విక్రయాలను నిరోధించేందుకు ‘ఆపరేఫన్ సేఫ్ స్కూల్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. పాఠశాలల చుట్టూ 100 గజాల పరిధిలో పొగాకు, నికోటిన్ పదార్థాలు, సిగరెట్లు, గంజాయి, ఇతర నిషేధిత ఉత్పత్తుల విక్రయాలను నిరోధించేండమే ఈ ఆపరేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థులు చేతుల్లో ఉంటుందని, కాబట్టి విద్యార్థులను సక్రమమైన బాటలో నడిపించే బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తుచేశారు. విద్యా సంస్థల సమీపంలో పొగాకు, నికోటిన్ విక్రయాలు జరగకుండా స్థానికులు జాగ్రత్త పడాలని సజ్జనార్ సూచించారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ (Operation Safe Schools) కార్యక్రమంలో భాగంగా పాన్ షాపులను తనిఖీ చేసినట్లు తెలిపారు. దాదాపు 5,000 మంది సిబ్బందితో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అండర్‌కవర్ ఆపరేషన్ల ద్వారా సుమారు 550కి పైగా పాన్ షాపులపై దాడులు చేసి తంబాకు, నికోటిన్ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై COTPA (సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం), JJ చట్టం (జువైనల్ జస్టిస్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసినట్లు సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. రానున్న రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిషేధిత ఉత్పత్తులు విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: రాత్రి 8.30 గంటలకు ప్రధాని ప్రసంగం
Follow Us On : WhatsApp

