కలం, సెంట్రల్ డెస్క్: 33 Percent Women Reservation Bill | రువాండా.. ఆఫ్రికాలోని ఓ చిన్నదేశం. జనాభా కేవలం కోటిన్నర. కానీ అక్కడి పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా ప్రతినిధులు 60 శాతంపైనే. ప్రపంచంలోనే మహిళలకు అగ్రతాంబూలం వేస్తున్న కంట్రీల్లో దానిదే మొదటి స్థానం! కోటీ 10 లక్షల జనాభా ఉన్న క్యూబాలోనూ 55 శాతం మంది ప్రజాప్రతినిధులు మహిళలే! మతపరమైన నిబంధనలతో మహిళలపై వివక్ష ప్రదర్శించే యూఏఈ చట్టసభల్లోనూ ఉమెన్ కోటా 50 శాతంపైనే!! స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు దగ్గరికి వస్తున్నా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏండ్లు దాటుతున్నా 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో మాత్రం మహిళా ప్రాతినిధ్యం అంతంతే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ.. 543 సీట్లున్న లోక్‌సభలో ప్రస్తుతం మహిళా ప్రజాప్రతినిధులు 74 మందే. మొత్తం సభ్యుల్లో ఇది కేవలం 13.65 శాతమే! ఇక తెలంగాణ అసెంబ్లీని పరిశీలిస్తే మొత్తం 119 మంది సభ్యుల్లో మహిళా ఎమ్మెల్యేలు 8 మందే!!
చట్టసభల్లో 33 శాతం ఉమెన్ కోటా (33 Percent Women Reservation Bill) కోసం దేశంలో దశాబ్దాలుగా పోరాటం సాగుతూనే ఉంది. నాటి యూపీఏ, ఎన్డీఏ హయాంలో చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. కానీ, 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లును తెచ్చి చట్టబద్ధత కల్పించింది. దాని ప్రకారం 2026 తర్వాత పూర్తయ్యే జనగణన అనంతరం జరిగే లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉన్నది. అప్పటివరకూ వెయిట్ చేయడమెందుకనే చర్చలు జరుగుతున్న తరుణంలో 2029లోనే అమల్లోకి తెచ్చేలా తాజా పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక సవరణకు కేంద్రం ఓకే చెప్పింది. డీలిమిటేషన్ చేపట్టి లోక్‌సభ స్థానాలను 850కు పెంచి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నది. దీంతో 272 మంది మహిళా ఎంపీలు లోక్‌సభలో కొలువుదీరనున్నారు.
మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలంటూ బహిరంగ వేదికల మీద గంభీర ఉపన్యాసాలు చేసే నేతలు చివరకు కేబినెట్‌లో స్థానమే కల్పించని ఘట్టాన్ని స్వరాష్ట్రంలో తెలంగాణ అనుభవించింది. మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడాన్ని జీర్ణించుకోలేక వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డంకులు సృష్టిస్తున్న ఘటనలూ కళ్లముందే ఉన్నాయి. ఈ 33 శాతం కోటాతోనైనా పాలనలో ‘మహిళా సాధికారత’ సాధ్యమవుతుందా? ‘ఆకాశంలో సగం’ అనే నినాదం ఫలిస్తుందా?! వివక్ష నుంచి విముక్తి దిశగా మహిళల బలమైన అడుగులు పడతాయా? ‘గాజులు తొడుక్కున్నామా.. ఉట్టికి ఎగరలేనమ్మ.. చీరకట్టుకొని ఇంట్లో కూర్చో’ అనే కామెంట్లతో పురుషాధిక్యత ప్రదర్శించే నాయకుల నోళ్లు మూతపడతాయా? వీటన్నింటిపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: Instagram

