ఆ పార్టీలు మూల్యం చెల్లించుకుంటాయి.. జగన్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లను వ్యతిరేకించిన పార్టీలు భవిష్యత్ లో దారుణమైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ పరిణామం మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు శాపం గా మారిందని ఆరోపించారు.

ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని జగన్ ఆరోపించారు. మహిళ రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఎందుకు అన్యాయంగా ఉంటున్నాయో తెలియడం లేదని చెప్పారు. ఇదే సమయంలో ఒకవేళ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాదిలో జనాభా తగ్గిందని గుర్తు చేశారు.

Read Also: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ భారీ స్కామ్.. !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>