బీజేపీ బ్రహ్మాస్త్రానికి బ్రేక్ వేసిన ‘ఇండియా’

కలం, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుపై (Women Reservation Bill ) ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల మధ్య బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. మహిళల రిజర్వేషన్లను విపక్షాలు అడ్డుకున్నాయంటూ బీజేపీ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలది మహిళా వ్యతిరేక స్వభావం అంటూ రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ టీమ్ పార్టీలన్నీ “కేంద్ర ప్రభుత్వం పెట్టింది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు.. దాని ముసుగులో ఉన్న డీలిమిటేషన్ బిల్లు.. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది.. మేం ఓడించింది మహిళా రిజర్వేషన్ బిల్లును కాదు.. డీలిమిటేషన్ కుట్రను. దేశానికి జరిగే పెను ప్రమాదాన్ని నివారించాం..” అని వ్యాఖ్యానించాయి.

ఎవరి వాదనలు ఎలా ఉన్నా అంతా రాజకీయమే! మహిళా కోటాకు ఎప్పటిలానే అడుగడుగునా ఆటంకాలు. పాలకులకు చిత్తశుద్ధి కరువు.. ప్రతిపక్షాలదీ అదే తంతు!! ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమబెంగాల్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మహిళా రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ, ఎన్డీఏ పార్టీలు వాడుకోవాలని చూస్తున్నాయి. దీనికి దీటుగా డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి. బీజేపీకి నిజాయితీ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా పెడితే ఇప్పటికిప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా, సవరణలకు పట్టుబడకుంటా ఉన్నదున్నట్లుగా ఆమోదిస్తామని హామీ ఇస్తూనే బీజేపీ రంగును బయటపెడుతున్నాయి.

ముప్పై ఏండ్ల మహిళా రిజర్వేషన్ అంశానికి 2023లోనే చట్టబద్ధత లభించింది. ఐదారు ప్రయత్నాల తర్వాత సక్సెస్ సాకారమైంది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ నాడు సంపూర్ణంగా మద్దతు పలికాయి. దీంతో 2034 లోక్‌సభ ఎన్నికల నుంచి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలులోకి రావాల్సి ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ అట్టడుగున 154వ స్థానంలో ఉన్నది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో సైతం భారత్‌కంటే మెరుగైన తీరులో మహిళల ప్రాతినిధ్యం ఉన్నది. మహిళలకు ప్రాధాన్యంపై గొంతు చించుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు చట్టంతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో ఎంత మంది మహిళలకు టికెట్లు ఇస్తాయన్నది ప్రశ్నార్థకం.

ఇంతకూ విపక్షాలు ఓడించింది మహిళా రిజర్వేషన్ బిల్లునా? లేక డీలిమిటేషన్ (Delimitation) చేయాలన్న రాజ్యాంగ సవరణ బిల్లునా?.. మహిళా బిల్లునే ఆమోదం పొందకుండా చేశాయన్నది బీజేపీ వాదన. మహిళా కార్యకర్తలను విపక్ష నేతల ఇండ్ల ముందు ధర్నాలకు దింపింది. మరోవైపు కాంగ్రెస్ సహా విపక్షాలు మాత్రం తాము వ్యతిరేకించింది మహిళా బిల్లును కాదని, డీలిమిటేషన్ బిల్లునే అని తేల్చిచెప్తున్నాయి. నిజానికి ఓటింగ్ జరిగింది కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కాదు.. రాజ్యాంగ సవరణ బిల్లు మీదనే! విపక్షాలను విమర్శించేందుకు మహిళా బిల్లును బీజేపీ అస్త్రంగా వాడుకుంటున్నది. దాన్ని తిప్పికొట్టేందుకు ‘ఇండియా’ టీమ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది.

ఎన్డీఏ (NDA) ఉచ్చులో ‘ఇండియా’ కూటమి (INDIA) చిక్కుకున్నదా? లేక ఇండియా కూటమి ప్లాన్‌తో ఎన్డీఏ బొక్క బోర్లా పడిందా? రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ప్రతిపక్షాలకు ప్లస్ అయిందా? లేక అధికారపక్షానికి కలిసొచ్చిందా? బీజేపీ బిల్లుల హంగామా మహిళలకు రాజకీయ అశకాశాలు కల్పించడానికా? లేక పొలిటికల్ డ్రామానా? తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలయ్యేంత వరకు ఓ పది రోజుల పాటు పొలిటికల్ బ్లేమ్ గేమ్ కంటిన్యూ కానున్నదా? వీటిపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Women Reservation Bill
Women Reservation Bill

Read Also: రాత్రి 8.30 గంటలకు ప్రధాని ప్రసంగం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>