కలం, తెలంగాణ బ్యూరో : జగిత్యాలలో కేసీఆర్ హాజరయ్యే బహిరంగసభపై బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు గంపెడాశలు పెట్టుకున్నారు. రెండేండ్ల తర్వాత కేసీఆర్ ఫస్ట్ టైమ్ కేసీఆర్ పబ్లిక్ మీటింగ్‌కు హాజరవుతున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత 2024 ఫిబ్రవరిలో నల్లగొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత ఆ స్థాయిలో ఈ నెల 20న జగిత్యాలలో జరుగుతున్నది. పొలిటికల్‌గా మైలేజ్ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తున్నది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ సైతం భారీ స్కెచ్ వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే రోజున ఉత్తర తెలంగాణలో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించి మరమ్మత్తు పనులపై గైడెన్స్ ఇవ్వనున్నారు. ఒకే రోజున రెండు పార్టీల అగ్రనేతలు (Revanth vs KCR) ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టి పోటాపోటీ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం గమనార్హం. తగ్గేదే లే.. ఒకే రోజున అన్నట్లుగా ఇద్దరి కార్యక్రమాలు ఆసక్తికరంగా మారాయి.
సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ స్ట్రాటెజీ :
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే జగిత్యాల బహిరంగసభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగిత్యాలలో జరుగుతున్న సభ రెండోది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్‌లో చేరడంతో ఉత్తర తెలంగాణలో బలప్రదర్శనగా వాడుకోవాలన్నది ఆ పార్టీ ప్లాన్. అందులో భాగంగా రెండేండ్ల నుంచి ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు బహిరంగ సభ ద్వారా దర్శనం ఇవ్వనున్నారు. ఆయన ఏం మాట్లాడతారు.. కాంగ్రెస్‌పై ఎలాంటి విమర్శలు చేస్తారు.. పార్టీ శ్రేణులను ఏ తీరులో ఉత్సాహపరుస్తారు.. ఇలాంటి అంశాలపై గులాబీ కేడర్ ఆశలు పెట్టుకున్నది. పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్న ఈ సభకు కౌంటర్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ ప్రణాళిక వేశారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అటెన్షన్ కలిగేలా షెడ్యూలును ఖరారు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ చేసే విమర్శలకు సీఎం రేవంత్ (Revanth vs KCR) రియాక్షన్ ఈ సభలో వినిపించే అవకాశమున్నది.
కాళేశ్వరం, మేడిగడ్డ ఎజెండాగా సీఎం టూర్ :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాధారణంగా ఏప్రిల్ 20న ఉత్తర తెలంగాణలో పర్యటించడం ఆనవాయితీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లి వేదికగానే గిరిజన దండోరాను ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జనవరి థర్డ్ వీక్‌లో ఇంద్రవెల్లిలో పర్యటించి అమరవీరుల జ్ఞాపకార్ధం స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉంటున్నందున ముందుగానే విజిట్ చేశారు. మరుసటి సంవత్సరం (2025) ఇదే స్మృతివనానికి ప్రారంభోత్సవం చేశారు. జిల్లాను విద్యాపరంగా డెవలప్ చేయడంతో పాటు కొమ్రంభీం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈసారి కూడా ఇంద్రవెల్లి టూర్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శిస్తారు. గోదావరి పుష్కరాలపై సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో రివ్యూ చేస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వనున్నారు.
కాంట్రాక్టు ఏజెన్సీలకు సీరియస్ వార్నింగ్ :
కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించి రిపేర్ పనులను వేగవంతం చేయడంపై కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇంజినీర్లు, అధికారులతో అక్కడే విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నిర్దిష్ట గడువులోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కాంట్రాక్టు సంస్థలకు టాస్క్ ఇవ్వనున్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందంటూ ఇప్పటికే అనేకసార్లు కామెంట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈసారి సొంత ఖర్చుతోనే ఈ మూడు బ్యారేజీల రిపేర్ పనులను కంప్లీట్ చేయాలని కాంట్రాక్టు ఏజెన్సీలకు క్లారిటీ ఇవ్వనున్నారు. కట్టింది ఆ సంస్థలే కావడంతో అవి డ్యామేజ్ అయినందున రిపేర్ చేసే బాధ్యత కూడా వాటిదేనని నొక్కిచెప్పనున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిపోయిన ఏడో బ్లాక్ మొత్తాన్ని తొలగించి కొత్తది నిర్మించాల్సి ఉన్నందున రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: WhatsApp

