కలం, వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా వినుకొండ సీఐగా విధులు నిర్వహించిన సీఐ చిన్నమల్లయ్య (CI Chinna Mallaiah) మరో వివాదంలో చిక్కుకున్నాడు. సీఐ చిన్నమల్లయ్య తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం వైద్య పరీక్షల కోసం మహిళను ప్రధాన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సీఐ చిన్నమల్లయ్య గతంలో కారంపూడిలో టీడీపీ నేత రాముపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు తుపాకీతో రాముని బెరిదించి సీఐ వార్తల్లో నిలిచాడు.
Read Also: తిరుపతి టౌన్‌ప్లానింగ్‌లో అక్రమాలు : అధికారులకు మెమోలు
Follow Us On: Instagram

