కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) లో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స విజయవంతమైంది. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ (GSD) తో బాధపడుతున్న 10 కిలోల బరువున్న 18 నెలల చిన్నారికి ఉస్మానియా వైద్యుల బృందం విజయవంతంగా కాలేయ మార్పిడి జరిపింది. తండ్రి లివర్ నుంచి కొంత భాగాన్ని సేకరించి, చిన్నారికి అమర్చినట్లు వైద్యుల బృందం తెలిపింది.
దాదాపు 14 గంటలపాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఇటువంటి అరుదైన శస్త్ర చికిత్స చేసి బాలుడి ప్రాణాన్ని కాపాడిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.
Read Also: మరో వివాదంలో సీఐ చిన్నమల్లయ్య!
Follow Us On: Sharechat

