భయపెడుతున్న వెదర్ కండిషన్స్

కలం, సెంట్రల్ డెస్క్: Heatwave Deaths | ఆహ్లాదకరమైన వాతావరణానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. అలాంటి కూల్ క్లైమేట్ ఉన్నందునే ఒకప్పుడు హైదరాబాద్‌లో ‘గరం సూటర్ల’కు (స్వెట్టర్) మంచి డిమాండ్ ఉండేది. నగరంలోని చాలా ప్రాంతాలకు ‘బాగ్’ అనే పేర్లు వచ్చాయి. ఇప్పుడు అలాంటి హైదరాబాద్ ‘హీట్ చాంబర్’లా మారిపోయింది. ఏప్రిల్‌లోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోహిణికార్తెకు ముందే రోళ్లు పగిలేలా టెంపరేచర్ పెరిగిపోతున్నది. ప్రతి ఏటా సమ్మర్‌లో ‘హయ్యెస్ట్’ అనే రికార్డులు నమోదవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా అర్బనైజేషన్‌తో సిటీ సహా రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారింది.
ఇక బొగ్గు నిక్షేపాలున్న రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం లాంటి గనుల ప్రాంతాల్లో ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. ఖమ్మంలో 2015లో నమోదైన 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలే రాష్ట్రంలో ఇప్పటివరకు ఆల్ టైమ్ హై.

ఇప్పుడు ఒక్క ఖమ్మంలోనే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ స్థాయిలో టెంపరేచర్ రికార్డవుతున్నది. రోళ్లు పగులుతున్నాయి.. కార్లు తగలబడుతున్నాయి.. ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు.. ఏటేటా ‘హీట్ స్ట్రోక్ డెత్స్’ పెరిగిపోతున్నాయి. ఏసీలు లేని ప్రజల బాధలు వర్ణనాతీతం. సామాన్యులకు అర్థం కాని ‘ఎల్‌నినో’, ‘లానినో’, ‘కార్బన్ ఎఫెక్ట్’, ‘గ్రీన్ హౌజ్ గ్యాసెస్’, ‘హ్యుమిడిటీ’.. ఇలాంటివాటి ప్రభావం ఎలా ఉన్నా నిన్నటిదాకా పచ్చగా నీడనిచ్చిన చెట్లు ఇప్పుడు అపార్టుమెంట్ల నిర్మాణం కోసం నేలకూలుతున్నాయి. దేవుళ్ల విగ్రహాల ఊరేగింపుల కోసం, విద్యుత్ వైర్ల కోసం చెట్ల కొమ్మలు రాలిపడుతున్నాయి. హరితహారం, వన మహోత్సవం.. ఇలాంటి ఎన్ని పేర్లతో మొక్కలు నాటుతున్నా ఏపుగా పెరిగిన చెట్లను నరికేస్తున్నాం. కొత్త సచివాలయం కోసం వేలాది చెట్లను వేళ్లతో సహా పీకేశాం. ఇప్పుడు అక్కడ నీడ కోసం అవస్థలు పడుతున్నాం.

ఎండలకు తోడు భూగర్భ జలాలు అడుగంటి ‘ప్యాకేజ్డ్ వాటర్’ పేరుతో క్యాన్లలో కొనుక్కుని తాగుతున్నాం.. వాడుకోడానికి ట్యాంకర్లతో తెప్పించుకుని సంప్‌లలో నింపుకుంటున్నాం. ఒకవైపు కాంక్రీట్ స్ట్రక్చర్లు, మరోవైపు వాహనాల కాలుష్యం, చెరువుల ఆక్రమణ, పార్కుల కబ్జాలు… జనానికి చల్లదనం లేకుండా చేస్తున్నాయి. ఇంకుడు గుంతలు, ఇంటికో చెట్టు.. ఇవన్నీ కాగితాలకే పరిమితం. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటూ మన స్వయంకృతాపరాధంతో మన తర్వాతి తరాలనూ ఇబ్బందుల్లోకి నెడుతున్నాం.

వడదెబ్బకు ఏటా మన దగ్గర ఎంత మంది చనిపోతున్నారు.. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌పై ప్రభుత్వానికి నిర్లక్ష్యమెందుకు.. టెంపరేచర్ నియంత్రణలో ప్రభుత్వాల పాత్ర ఏంటి.. ప్రజలను భాగస్వామ్యాన్ని పెంచడంలో ఉదాసీనత ఎందుకు.. ఎల్‌నినో, లానినో లాంటి మార్పులకు కారణమెవరు..? వీటన్నింటిపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Heatwave Deaths
Heatwave Deaths

Read Also: రాహుల్ గాంధీ సంచలన పోస్ట్.. ‘ధరలు పెరగబోతున్నాయ్’

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>