గుండాలలో లంచం తీసుకుంటూ ఫారెస్ట్ అధికారి అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల(Gundala) మండలం నడిమిగూడెం ప్రాంతంలో ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీ  నిర్వహించారు. ఫారెస్ట్ బీట్ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ దాడులు చేపట్టారు. ఫారెస్ట్ బీట్ అధికారి బానోతు నరేష్ ఒక పోడు రైతు వద్ద రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా, ఆ  రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం నిఘా పెట్టి, డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నరేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను మోసం చేస్తూ అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>