Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుపతి టౌన్‌ప్లానింగ్‌లో అక్రమాలు : అధికారులకు మెమోలు

కలం, వెబ్‌ డెస్క్‌ : తిరుపతి నగరపాలక సంస్థలో గత కొంతకాలంగా సాగుతున్న టౌన్ ప్లానింగ్ (Tirupati Town Planning) అక్రమాలు బట్టబయలయ్యాయి. ఏసీబీ అధికారులు అందించిన నివేదిక ఆధారంగా మొత్తం 11 మంది అధికారులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. 2022 ఆగస్టు నెలలో ఏసీబీ బృందాలు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో భారీగా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించాయి.

ముఖ్యంగా టీడీఆర్ బాండ్ల జారీ, జోనింగ్ నిబంధనల అమలులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సిద్ధం కానుంది. నిబంధనలు అతిక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Read Also: లైంగిక వేధింపుల ఆరోపణలు: SRM హెచ్‌ఓడీపై కేసు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>