Mobile Popup Ad
Mobile Popup Ad

రాజధాని అమరావతిపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాజధాని అమరావతి (Amaravati) పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన క్రమంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అమరావతిలో మొత్తం రూ. 2,540 కోట్లతో అభివృద్ధి చేయాలని తాజాగా ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది.

అంతేకాదు అసెంబ్లీ పరిసరాల్లో వర్క్స్ కు రూ. 798 కోట్ల ప్రతిపాదనకు , అలాగే ఉండవల్లి జోన్ లో మౌలిక వసతులకు రూ. 580 కోట్ల ప్రణాళికలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగుతుండగా.. మరిన్ని కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.

Read Also: చమురు సంక్షోభం.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>