Mobile Popup Ad
Mobile Popup Ad

లైంగిక వేధింపుల ఆరోపణలు: SRM హెచ్‌ఓడీపై కేసు

కలం, వెబ్‌ డెస్క్‌ : అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (SRM University)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ వేధింపుల బాగోతం వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ప్రొఫెసర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కోరిక తీర్చాలంటూ బాధితురాలిపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని వానిష్ మోడ్ ఫీచర్‌ను అడ్డుపెట్టుకుని అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడుతూ నిందితుడు ఈ అకృత్యాలకు పాల్పడటం గమనార్హం.

మహిళా ప్రొఫెసర్ ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (SRM University) యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టింది. నిందితుడిని హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అంతర్గత విచారణకు ప్రత్యేక కమిటీని ఆదేశించింది. పోలీసులు ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also: ప‌రీక్ష‌లో ఫెయిల్ భ‌యంతో సూసైడ్‌.. రిజ‌ల్ట్ చూస్తే షాక్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>