కలం, వెబ్ డెస్క్: షార్ట్ సర్క్యూట్ కారణంగా నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయిన విషయం తెలిసిందే. గుండెలను పిండేసే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెంటనే స్పందించారు. ఆ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు.

