కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “మన శంకరవరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu). దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందించిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ స్పీచ్ హైలైట్ అయ్యింది. ఆయన అనిల్ రావిపూడితో సరదాగా నెక్ట్స్ సినిమా నాతో చేస్తావా.. చేయవా.. అంటూ జోక్స్ వేశారు. అంతకుముందే అనిల్ రావిపూడికి మెగాస్టార్ ఖరీదైన రేంజ్ రోవర్ (Range Rover) కారు బహుమతిగా ఇచ్చారు. గతేడాది అనిల్ కు వాచ్ బహుమతిగా ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ నేపథ్యంలో లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తనతో నెక్స్ట్ సినిమా చేయాలంటే హెలికాప్టర్ కావాలంటావా అంటూ వేదిక మీద మెగాస్టార్ సరదాగా అన్నారు. షీల్డుల బహూకరణలతో ఈ కార్యక్రమం గతంలో జరిగే ఈవెంట్ లను గుర్తుచేసింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ తన యూనిట్ లోని ప్రతి ఒక్కరినీ అభినందించారు. సక్సెస్ అనేది రోజూ చేసే భోజనం లాంటిదని, ఎప్పుడూ బోర్ కొట్టదని మెగాస్టార్ (Chiranjeevi) చెప్పారు. తాను ఇలాంటి సక్సెస్ ఇచ్చే ప్రోత్సాహాన్ని, సంతోషాన్ని ఎన్నోసార్లు అనుభవించానని, ఇప్పుడు ఈ టీమ్ అంతా ఆ సంతోషాన్ని పొందడం చూస్తుంటే హ్యాపీగా ఉందని చెప్పారు.
Read Also: ఆదిత్య 999 ముహూర్తం ఫిక్స్ ?
Follow Us On: Pinterest


