కలం, వెబ్ డెస్క్ : రిపబ్లిక్ డే వేడుకలకు ఒకరోజు ముందే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి అవార్డులు వచ్చాయి. అందులో ఏపీ నుంచి నలుగురికి ఈ సారి పద్మ అవార్డు దక్కింది. సినిమా రంగంలో సేవలందించినందుకు గాను నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ కు పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ప్రముఖ గాయకుడు, టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం పద్మ శ్రీ అవార్డు వరించింది. ప్రముఖ రచయిత వెంపటి కుటుంబ శాస్త్రికి కూడా పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
Read Also: తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మ అవార్డులు
Follow Us On: Pinterest


