కలం, వెబ్ డెస్క్ : మిషన్ కర్మయోగి (Mission Karmayogi) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా కోటి ఎన్రోల్మెంట్స్, 80 లక్షల కోర్సులు పూర్తి చేసుకున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నిలిచింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇది గొప్ప శుభవార్త.. ఐగాట్ కర్మయోగి పోర్టల్‌లో 4,290 కోర్సులలో కోటి కంటే ఎక్కువ నమోదులు కావడం, 80 లక్షల కోర్సుల పూర్తి జరగడం, నిరంతర అభ్యాసం పట్ల మన ప్రభుత్వ ఉద్యోగుల దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (APSDPS) సమర్థవంతంగా ముందుకు నడిపించిన ఈ విజయం.. ఆంధ్రప్రదేశ్‌కు నైపుణ్యం కలిగిన, చురుకైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే పరిపాలనను నిర్మిస్తుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.


