కలం, వెబ్ డెస్క్ : Chandrababu – Modi | నీటి సంరక్షణపై అనంతపురం జిల్లా ప్రజలు చేపడుతున్న చర్యలను మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. వర్షాలు కురవని పరిస్థితులలో ప్రజలు స్వయంగా జలాశయాలను పునరుద్ధరించుకోవడం అభినందనీయమని ప్రధాని మోడీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఇప్పటి వరకూ పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించుకున్నారని అనంతపురం ప్రజలను మోడీ అభినందించారు.
తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో అనంతపురం ప్రజల నీటి సంరక్షణ ప్రయత్నాలను ప్రస్తావించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి సీఎం చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నీటి భద్రత అనేది మా స్వర్ణాంధ్ర విజన్ లోని పది సూత్రాలలో ఒకటి అని తెలిపారు.
ఆధునిక సాంకేతికతను సంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతులతో సమన్వయం చేస్తూ, బలమైన నీటి సంరక్షణ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు మేము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు అనంతపురం ప్రజల నీటి సంరక్షణపై ప్రధాని నరేంద్ర మోడి సందేశం మా సంకల్పానికి మరింత ప్రేరణ ఇస్తుందని చంద్రబాబు (Chandrababu) ట్వీట్ చేశారు.
Read Also: వైసీపీ వాళ్లతో మాట్లాడితే పేగులు తీస్తా : చింతకాయల విజయ్
Follow Us On: Sharechat


