కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్‌లు ఓ ఇంటివారు కాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు (Keeravani son) కాలభైరవ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ వర్గాల ప్రకారం.. కాలభైరవ (Kaala Bhairava) బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్‌ను పెళ్లిచేసుకోవచ్చని సమాచారం. ఈ నటి కూడా ప్రేమలో ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హీరోయిన్ చాందిని చౌదరి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో కాల భైరవ ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అలాగే పెళ్లివార్తలపై కీరవాణి కుటుంబం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Read Also: సినీ నటి హన్సిక విడాకులు.. అసలు కారణం ఏమిటి?!
Follow Us On: Facebook

