కలం, వరంగల్ బ్యూరో : రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేటీఆర్ (KTR) తో ఛాలెంజ్ చేసి సైలెంట్ అయిపోయాడు. నువ్వెంత, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా.. జాతర అయ్యాక రాజీనామా చేసి గెలువు. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్ (Dasyam Vinay Bhasker), ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy)కి సవాల్ విసిరారు. హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయిని రాజేందర్ రెడ్డిపై మండి పడ్డారు.
నా నాయకుల మీద నమ్మకం ఉంది కనుకనే నేను రాజీనామా చేసి గెలిచాను. నీకు పార్టీ మీద, నీ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేసి గెలవాలి అని అన్నారు. పోలీసులను సైతం హెచ్చరిస్తున్నా.. మా నాయకులపైన, కార్యకర్తలపైన, పార్టీ వ్యక్తులపైన అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని అన్నారు. వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి, సంక్షేమం అందించామని, నీలాగ పబ్లిసిటీ చేసుకునే వాడిని కాదు. కార్పొరేషన్‌లో 26 స్థానాలకు 26 స్థానాలు గెలుస్తా అనడం కాదు గెలిచి చూపించాలని విమర్శించారు.
Read Also: మేడారంలో భక్తుల రికార్డు: మంత్రి పొంగులేటి
Follow Us On : WhatsApp


