కలం, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్ అదిరిపోతుందని చెబుతోంది ఆయన కూతురు సౌందర్య (Soundarya Rajinikanth). దర్శకురాలిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తోంది సౌందర్య. తన తండ్రి, రజినీకాంత్ బయోపిక్ పనులు ఆల్రెడీ తాను మొదలుపెట్టినట్లు ఆమె వెల్లడించింది. ఇటీవల విత్ లవ్ పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మించింది సౌందర్య. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె రజినీ బయోపిక్ గురించి మాట్లాడింది. ఈ వార్త బయకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతుంది.
రజినీకాంత్ బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్నాయని, ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులంతా సంతృప్తి పడేలా ఆ బయోపిక్ ఉంటుందని సౌందర్య తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేసినట్లు ఆమె చెబుతోంది. అయితే రజినీ బయోపిక్ లో ఎవరు నటిస్తారు, ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది సౌందర్య చెప్పలేదు. ఆ వివరాలను త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
గతంలో రజినీకాంత్ తో కొచ్చాడియాన్ అనే యానిమేషన్ మూవీ చేసింది సౌందర్య (Soundarya Rajinikanth). ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేసిన ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. అయితే టెక్నీషియన్ గా సౌందర్యకు మంచి పేరొచ్చింది. ఈ క్రమంలో నిర్మాతగా, దర్శకురాలిగా తన కెరీర్ కొనసాగిస్తూ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది సౌందర్య. రజినీకాంత్ బయోపిక్ (Biopic)కు ఆమె మెగాఫోన్ పట్టినా ఆశ్చర్యం లేదు అనే టాక్ వినిపిస్తోంది.
Read Also: ప్రభాస్ లైనప్ మారిందా..?
Follow Us On: Sharechat


