కలం, వెబ్ డెస్క్ : సింగరేణి టెండర్ల (Singareni Tenders)పై తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డి రాగానే విచారణను కోరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలో భట్టి స్పందించారు. శనివారం జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణి ఆధ్వర్యంలో తాడిచెర్ల మొదలు తాజాగా టెండర్ వరకు అన్నింటి పై దర్యాప్తు జరగాలన్నారు.
సృజన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ మనిషి కందాల ఉపేందర్ రెడ్డి కూతురు భర్తే సృజన్ రెడ్డి అని భట్టి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే చర్చించుకుంటామన్నారు. కానీ, మధ్యలో సింగరేణి సంస్థను ఎందుకు బలి చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిపై ఏ గద్దలనూ, రాబందులను వాలనివ్వనని భట్టి స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధంగా ఉన్నామని, హరీష్‌రావు లేఖ రాయాలనుకుంటే తనకు రాయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సూచించారు.
Read Also: ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్
Follow Us On: Sharechat


