కలం డెస్క్ : హైస్కూల్‌లో మాథమాటిక్స్ సబ్జెక్టులో ఈక్వేషన్స్ అనే ఛాప్టర్‌లో లాజికల్ థింకింగ్ గురించిన ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సైతం అదే ఈక్వేషన్స్ ఫార్ములాను జనం మీదకు వదిలారు. అయితే ‘ఏ’, ‘బీ’, ‘సీ’ లను రాజకీయ పార్టీలకు ఆపాదించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీల గురించి ప్రస్తావించారు. సమాజ్‌వాదీ (Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, అటు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన ఫోటోలను షేర్ చేశారు. ఏ పార్టీ దేనికి ‘బీ టీమ్’ (B Team) అనేది తేలిపోయిందన్నారు.
మధ్యవర్తి ద్వారా బీఆర్ఎస్‌తో స్నేహం :
ఒకవైపు బీఆర్ఎస్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని రాహుల్‌గాంధీ ఢిల్లీలో గంభీర ప్రకటనలు చేస్తూ ఉంటే అఖిలేష్ యాదవ్ ద్వారా బీఆర్ఎస్‌తో నాలుగు గోడల మధ్య రహస్య సంబంధాలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ రాజకీయ సంబంధాలు ఏ పార్టీతో ఎలా ఉంటాయో అఖిలేష్ హైదరాబాద్ ట్రిప్ స్పష్టం చేస్తుందన్నారు. ఈ మూడు పార్టీలను ‘ఏ’, ‘బీ’, ‘సీ’ అని తనదైన మ్యాథమాటిక్స్ ఈక్వేషన్‌ను జనం ముందుకు తీసుకొచ్చారు బండి(Bandi Sanjay). ఏ, సీ అనే పార్టీలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోవచ్చని పరోక్షంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల బంధం గురించి సెటైర్ వేశారు. ఈ మూడింటిలో సమాజ్‌వాదీ పార్టీ మరో రెండింటిని కలిపే పని పెట్టుకున్నదని, ఈ మూడు పార్టీల మధ్యా సంబంధాలున్నాయని అన్నారు. పైకి రాజకీయ ప్రత్యర్థి అంటూనే లోపల ఒక్కటిగానే కలిసి పనిచేస్తున్నాయన్నారు.
Read Also: సమ్మిట్ సమిష్టి నిర్ణయం కాదా?
Follow Us On: Youtube


