Mobile Popup Ad
Mobile Popup Ad

లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

కలం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై (Kavitha) వచ్చిన ఆరోపణలు ఆమె రాజకీయ జీవితంలోనే ఒక మచ్చ. సొంత పార్టీలోనే (బీఆర్ఎస్) గ్యాప్ పెరిగింది. నేతల నుంచి వివక్ష ఎదుర్కొన్నారు. పార్టీకి మురికి అంటించి ఓడిపోయేందుకు కారణమయ్యారనే అనేక విమర్శలను భరించారు. చివరికి బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు ఆ కేసు పరోక్షంగా ఒక కారణమైంది. బండి సంజయ్ లాంటివారు ‘లిక్కర్ క్వీన్’ అన్నారు. ఇంకొందరు ‘లిక్కర్ దందా’ అన్నారు. ఇప్పుడు అదంతా గత చరిత్ర! ఆ కేసులో ఆమె ప్రమేయం లేదంటూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిర్దోషిగా పేర్కొన్నది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టేసింది. పొలిటికల్ కెరీర్‌లో కవిత ఊహించని మలుపు ఇది. సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్న తరుణంలో ఈ తీర్పు రావడం ఆమెకు బిగ్ రిలీఫ్. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు ఇంతకాలం చేసిన ఆరోపణలకు ఆమె ఇవ్వబోయే కౌంటర్ ఏంటి? ‘కడిగిన ముత్యం’లా బయటకొస్తుందని అప్పట్లోనే కామెంట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎలా స్పందిస్తారు? సస్పెన్షన్ వేటు ఎత్తివేసి పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఆమె వెళ్లేందుకు సిద్ధమవుతారా? ఇంతకాలం విమర్శించినవారి నోళ్లు మూయించేందుకు కవిత అనుసరించబోయే స్ట్రాటజీ ఏంటి?

లిక్కర్ క్వీన్ టు క్లీన్ క్వీన్ : కవిత రాజకీయ పరిణామాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి

Kavitha
Kavitha

Read Also : కవిత గారూ.. అంటూ కేటీఆర్ షాకింగ్ రియాక్షన్..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>