కలం, తెలంగాణ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ ‘సుప్రీం’ అయాతొల్లా ఖమేనీ మృతి చెందిన వార్త తెలియగానే పశ్చిమాసియాపై ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రమయ్యాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా మిస్సైల్స్, డ్రోన్లు ప్రయోగిస్తున్నది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ నెలకొన్నది. అణ్వాయుధాల ఆరోపణలతో తమపై దాడిచేస్తున్న ఇజ్రాయెల్, అమెరికాకు సత్తా ఏంటో చూపిస్తామని ఇరాన్ (Iran – Israel War) ఎదురుదాడికి దిగుతున్నది.
పరస్పర దాడులు, యుద్ధ వాతావరణం ఎటువైపు దారితీస్తుందోనన్న భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నది. ఇది అణుయుద్ధం వైపు దారి తీయొచ్చన్న ఆందోళనలూ లేకపోలేదు. పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దుబాయ్, ఖతార్, అబుదభీ, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌పై ఇరాన్ వరుస దాడులతో వారి బాగోగులపై ఇక్కడి పేరెంట్స్, కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. అమెరికా స్థావరాలే టార్గెట్‌గా జరుగుతున్న ప్రతీకార దాడులతో చాలా దేశాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నది.
ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ లో హైటెన్షన్ పై కలం 360 డిగ్రీస్ స్పెషల్ కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఇరాన్‌లో యుద్ధంతో ‘బాస్మతి’ ధరలు పతనం.. ఆందోళనలో హర్యానా రైతాంగం
Follow Us On: Instagram

