epaper
Sunday, March 1, 2026
epaper

మోత మోగింది.. జింబాబ్వేపై భారీ విజయం

కలం, స్పోర్ట్స్ బ్యూరో: చెన్నై చిదంబరం స్టేడియంలో బౌండరీలు, సిక్సర్ల మోత మోగింది. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశారు. ఫామ్ లో లేడనే విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో షేక్ చేశాడు. హార్దిక్ పాండ్యా మరో అర్ధ శతకంతో, తిలక్ వర్మ 44 రన్స్ తో దుమ్మురేపారు. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సూపర్ 8లో తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్ ల్లో ఒకటైన జింబాబ్వేతో టీమిండియా గురువారం రాత్రి తలపడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత ఆటగాళ్లు ఆరు ఓవర్లు ముగిసే సరికి దాదాపు 80 రన్స్ చేశారు. 20 ఓవర్లలో 256 పరుగులు తీశారు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో రెండో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టులో బ్రెయిన్ బెన్నెట్ (97) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

కానీ.. టీమిండియా పెట్టిన భారీ స్కోర్ ముందు ఆ జట్టు నిలువలేకపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఇప్పటికే టీమిండియాతో గెలిచిన సఫారీలు తాజా గెలుపుతో సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుసగా రెండు ఓటములతో జింబాబ్వే జట్టు ఇంటి బాట పట్టింది. మార్చి 1న జరిగే వెస్టిండిస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే.. అది సెమీఫైనల్ కు వెళ్తుంది.

కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

T20 World Cup
T20 World Cup

Read Also: కుమ్మెర ఘటన.. రేణూ దేశాయ్ పై ట్రోల్స్.. ఎందుకు..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!