Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ మూవీ డబ్బింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్

కలం,సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchibabu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది'(Peddi). వృద్ది సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(A R Rahman) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది(Peddi) సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగల్ రిలీజ్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా  సెకండ్ సింగల్‌ను మార్చి 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే  హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి తాజాగా డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం చరణ్ డబ్బింగ్ చెబుతున్న క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>