Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్ చాక్లెట్లతో హిందూ అమ్మాయిల ట్రాప్: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో హిందూ అమ్మాయిలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరంలోని పాతబస్తీలో ఎంఐఎం మద్దతుతో కొందరు గూండాలు డ్రగ్స్, గంజాయి కలిపిన చాక్లెట్లు, కేకులు ఇచ్చి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ లవ్ జిహాద్’ రాకెట్ ను తామే స్వయంగా బయటపెట్టామన్నారు. డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఎంఐఎం అండతో పాతబస్తీలో నడుస్తున్న డ్రగ్స్ దందాపై ఎందుకు దాడులు చేయడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న నీచులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.

తాము చెప్పేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది? బండి సంజయ్ (Bandi Sanjay) అని ప్రశ్నించారు. హిందూ మహిళలపై జరుగుతున్న దాడులపై వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో లవ్ జిహాద్ ఉచ్చులోకి లాగి మత్తుమందు ఇచ్చి హిందూ యువతిపై సామూహిక అత్యాచారం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని హిందూ ఆడబిడ్డలకు రక్షణ కరువైందనడానికి సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. కామాంధులు ఇంత బరితెగిస్తున్నా, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం నిమ్మకు నీరెత్తినట్లున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పరాకాష్టకు చేరుకున్న రేవంత్ సర్కార్ బుజ్జగింపు రాజకీయాలకు ఇదే నిదర్శనమని విమర్శించారు.

Read Also: ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>