Mobile Popup Ad
Mobile Popup Ad

ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తుంటే… ఇరాన్ కూడా ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చేలా చర్యలను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో టర్కీలోని ఇస్తాంబుల్ లో ఇజ్రాయెల్‌ కాన్సులేట్ (Israel Consulate) సమీపంలో కాల్పులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముగ్గురు దుండగులను హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు అధికారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై టర్కీ (Turkey) అధికారులు స్పందించారు. ఇజ్రాయెల్ కాన్సులేట్ వెలుపల లాంగ్ బారెల్ గన్స్ తో ముగ్గురు వ్యక్తులు కాల్పులకు యత్నించినట్లు వెల్లడించారు. వెంటనే భద్రతా బలగాలు వారిపై ఎదురు కాల్పులు జరపడంతో దుండగులు హతం అయినట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో కాన్సులేట్ (Israel Consulate) ఎదుట భారీగా భద్రత మోహరించినట్లు టర్కీ అధికారులు భరోసా ఇచ్చారు. అయితే ఈ దాడి చేసిన వారి వివరాలు, ఎందుకు చేశారు అనే కారణాలు వెల్లడించలేదు. కాగా, ఇరాన్ తో యుద్ధం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ యుద్ధం వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని టర్కీలోని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Read Also: నాకు రేవంత్‌రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం లేదు: కేరళ సీఎం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>