కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping ) వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. తక్షణమే దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సిట్ విచారణ (KTR SIT inquiry) సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేసి ఎంతో మంది జీవితాలతో ఆడుకుందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత మంది నష్టపోయారో బయటపెట్టాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో నిజానిజాలు ఏంటో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి, సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకుందన్నారు. ఈ వ్యవహారంలో విచారణ వేగవంతం చేసి ప్రజలు వాస్తవాలు చెప్పాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆయన (Ramchander Rao) డిమాండ్ చేశారు.
Read Also: రిటైర్ అయినా వదిలిపెట్టం.. పోలీస్ ఆఫీసర్లకు హరీశ్ వార్నింగ్
Follow Us On : WhatsApp


