కలం, డెస్క్ : జనవరి 28 బుధవారం నుంచి కేంద్ర బడ్జెట్ (Union Budget )సమావేశాలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు మంగళవారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. దీనికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఈ సారి బడ్జెట్ (Union Budget )సెషన్స్ లో పలు కీలక బిల్లులను కూడా కేంద్రం ప్రతిపాదించబోతోంది. ఇందులో జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లుతో పాటు విద్యారంగంలో కీలక సవరణల కోసం బిల్లులను ప్రవేశ పెట్టబోతోంది కేంద్రం. అటు ప్రతిపక్ష ఇండియా కూటమి బడ్జెట్ అంశాలతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పోరాడేందుకు రెడీ అవుతోంది.


