epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

టీమిండియా ఓటమికి కారణమిదే: అజింక్య రహానే

కలం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ అనూహ్యంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై అజింక్య రహానే (Ajinkya Rahane) స్పందించారు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు మేనేజ్‌మెంట్‌పై పలు ప్రశ్నలు సంధించారు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో తరచూ మార్పులు చేయడమే ఈ ఓటమికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ శతకం వృథా అయింది. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అర్ధశతకాలు ఫలితం ఇవ్వలేదు. దీంతో భారత్ స్వదేశంలో తొలిసారిగా న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది.

“గత తొమ్మిది వన్డేల్లో భారత్ ఐదు మ్యాచ్‌లు ఓడింది. కారణం స్పష్టం. ఎక్కువ మార్పులు. వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఆటగాళ్లకు భద్రత అవసరం. జట్టు మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత కావాలి” అని రహానే అన్నారు. స్థిరమైన జట్టును నమ్మి కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యూజిలాండ్ ఏ లేదా బీ జట్టుతో వచ్చినా అంచనాలు భారత్ పక్షానే ఉన్నాయని చెప్పారు. భారత్ సులువుగా మూడు-సున్నాతో గెలుస్తుందని అందరూ భావించారని తెలిపారు. కానీ న్యూజిలాండ్ ఆట అద్భుతంగా ఉందని రహానే ప్రశంసించారు.

Ajinkya Rahane
Ajinkya Rahane

Read Also: ’తెలంగాణ రైజింగ్‘లో భాగస్వామ్యం అవ్వండి : మంత్రి శ్రీధర్​ బాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>