కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh).. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు ఈ చిత్రం నుంచి మూడవ సింగల్ గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ(U/A) సర్టిఫికేట్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ 1 గంట 11 నిముషాల 30 సెకండ్స్, సెకండ్ హాఫ్ 1 గంట 22నిముషాల 29 సెకండ్స్‌తో కలిపి మొత్తం రన్ టైమ్ 2 గంటల 34 నిముషాలుగా లాక్ అయింది. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని తెలుస్తుంది.

