కలం వెబ్ డెస్క్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్ డిప్యూటీ కలెక్టర్(Warangal Deputy Collector) వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ(ACB) అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad) లోని బోడుప్పల్‌లో ఉన్న వెంకట్‌రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి కేసుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లో జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి అధికార దుర్వినియోగంతో అక్రమంగా వందల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వెంకట్ రెడ్డి గతంలోనూ లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కాడు. ఆయనపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
Read Also: ఆరోగ్య మంత్రి ఇలాఖాలో టైమ్‌కు రాని డాక్టర్లు.. కమిషనర్ ఆగ్రహం
Follow Us On: Youtube


