కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా జోగిపేట ప్రభుత్వాసుపత్రిని (Jogipet Government Hospital) రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ (Ajay Kumar) ఆకస్మికంగా తనిఖీ చేసారు. టైంకి రాని డ్యూటీ డాక్టర్లపై అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో 22 మంది డాక్టర్ల ఉంటే కేవలం ఐదు మంది డాక్టర్లే డ్యూటీలో ఉండటం ఏంటని వైద్య విధాన పరిషత్ కమిషనర్ సీరియస్ అయ్యారు.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెన్షన్ వేటు తప్పదని కమిషనర్ డాక్టర్లను హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) నియోజక వర్గంలోనీ ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా డాక్టర్లు రావడం లేదని.. మిగతా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటని రోగులు అనుకుంటున్నారు.


